కాళేశ్వరం ప్రాజక్టు పరిధిలోని అనంతగిరి రిజర్వాయర్ కు 'అన్నపూర్ణ'గా నామకరణం

  • ఇప్పటికే పలు బ్యారేజిలకు దేవతల పేర్లు
  • లక్ష్మి, సరస్వతి, పార్వతి అమ్మవార్ల పేరిట నామకరణం
  • రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ లకు అవే పేర్లు కొనసాగుతాయని వెల్లడి
తెలంగాణ సర్కారు ఎంతో ప్రతిష్ఠాత్మక రీతిలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజక్టు పరిధిలోని బ్యారేజిలు, రిజర్వాయర్లు, ఇతర పంప్ హౌస్ లకు దేవతల పేర్లు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజక్టు పరిధిలోని మొదటి ఐదు నిర్మాణాలకు లక్ష్మి, సరస్వతి, పార్వతి అమ్మవార్ల పేర్లు పెట్టారు. తాజాగా, అనంతగిరి రిజర్వాయర్ కు అన్నపూర్ణ రిజర్వాయర్ గా సీఏం కేసీఆర్ నామకరణం చేశారు. అంతేగాకుండా, ఇక్కడి పంప్ హౌస్ కు కూడా అన్నపూర్ణ పంప్ హౌస్ అని పేరుపెట్టారు. అయితే, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ లకు మాత్రం అవే పేర్లు కొనసాగుతాయని తెలంగాణ సర్కారు పేర్కొంది.
Go Back to Shorts
Kaleshwaram
KCR
Telangana

More Telugu News